పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాల వల్ల అంతర్జాతీయ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణించాల్సిన సుమారు 700కు పైగా ముడి చమురు ట్యాంకర్లు ఉద్రిక్తతల భయంతో సముద్రంలోనే నిలిచిపోవడంతో చైనా వంటి అగ్రరాజ్యాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీంతో హార్ముజ్ జలసంధిని వెంటనే పునఃప్రారంభించాలని చైనా, ఇరాన్‌పై గరిష్ట స్థాయిలో దౌత్యపరమైన ఒత్తిడిని పెంచుతోంది. ఇరాన్‌కు సన్నిహిత దేశంగా పేరున్న చైనా, ఇప్పుడు తన సొంత ప్రయోజనాల దృష్ట్యా జలసంధిని మూసివేయడంపై అసహనం వ్యక్తం చేస్తోంది.

