చైతన్య రథసారథి, రాజ్యసభ మాజీ సభ్యుడు, మాజీ మంత్రి నందమూరి హరికృష్ణ 69వ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘననివాళి అర్పించారు. పట్టుదలకు మారుపేరుగా నిలిచిన శైలి ఆయనకు ఎందరో అభిమానులను సంపాదించి పెట్టిందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. నందమూరి హరికృష్ణ తరతరాలకు గుర్తుండిపోయే నాయకుడు. సినిమా నటుడుగానూ ఆయన చూపిన అసమాన ప్రతిభ చిరస్మరణీయం. ఈ సందర్భంగా హరికృష్ణకు నివాళులు అర్పిస్తున్నా’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

