హంతకుడు ముహమ్మద్ యూనస్ ఆధ్వర్యంలో బంగ్లాదేశ్‌లో బూటకపు ఎన్నికలు జరిగాయని మాజీ ప్రధాని షేక్ హసీనా మండిపడ్డారు. ఫాసిస్ట్ యూనస్ హయంలో నిర్వహించిన సార్వత్రిక ఎన్నికలను తక్షణమే రద్దు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. గురువారం పార్లమెంట్ స్థానాలకు జరిగిన ఎన్నికలను ఖండిస్తూ హసీనా ప్రకటన విడుదల చేశారు. అప్రజాస్వామిక పద్ధతిలో ఎన్నికలు జరిగాయని బంగ్లాదేశ్‌లో ఓటర్లు పాల్గొనకుండా, చట్ట వ్యతిరేకంగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా జరిగిన ఎన్నికలను రద్దు చేయాలి. యూనస్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

