చెన్నైలోని తిరువాన్మియూర్ పోలింగ్ కేంద్రానికి నటుడు అజిత్ కుమార్ చాలా సాధారణంగా, నిరాడంబరంగా వచ్చారు. ఎటువంటి హంగామా లేకుండా, భద్రతా సిబ్బంది హడావిడి లేకుండా.. ఒక సాధారణ పౌరుడిలా క్యూలో నిలబడి ఓటు వేసి వెళ్లారు. తమిళనాడు ఎన్నికలలో ఓటు వేసిన మొదటి సెలబ్రిటీగా కూడా ఆయన సోషల్ మీడియాలో గుర్తింపు పొందుతున్నారు. దీంతో సోషల్ మీడియా అంతా ఏకే కంట్రోల్లోకి వచ్చేసింది. ఎన్నికల బరిలో విజయ్ ఉన్నప్పటికీ, సోషల్ మీడియాలో మాత్రం అజిత్ పేరు టాప్లో ట్రెండ్ అవుతోంది.

