నాడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్రాతో కలుపడం ఒక తప్పని, కలిపినా, అలీ కమిషన్ రద్దు చేయవద్దు అని చెప్పిన ప్రాజెక్టులను రద్దు చేయడం మరో తప్పని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. తెలంగాణను ఆంధ్రాతో కలిపిన అనంతరం ఈ ప్రాంతానికి మేలు చేసే ప్రాజెక్టులను నాటి కాంగ్రెస్ ప్రభుత్వం రద్దుచేసి మరణశాసనం రాసిందని మండిపడ్డారు.ఏలేశ్వరం దగ్గర కట్టాల్సిన నాగార్జునసాగర్ ప్రాజెక్టును నందికొండకు మార్చి నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాలకు అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇయ్యాల వాళ్లు నీళ్ల గురించి మాట్లాడుతున్నరు.

