ముఖ్యమంత్రి అయ్యి చంద్రబాబు 30 ఏళ్లు పూర్తి చేసుకున్న ఈ ప్రత్యేక తరుణాన్ని పార్టీ శ్రేణులు సంబరాల వేదికగా మార్చేందుకు సిద్ధమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సెప్టెంబర్ 10న అనంతపురం జిల్లాలో భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఈ సభను రాష్ట్ర రాజకీయాల్లో మైలురాయిగా మలచాలని టీడీపీ శ్రేణులు ఇప్పటికే ఏర్పాట్లలో నిమగ్నమయ్యాయి. అనంతపురంలోని జిఎంఆర్ ఇంద్రప్రస్తా ప్రాంగణంలో ఈ సభ జరగనుంది.
ఈ మహాసభకు సుమారు మూడున్నర లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు.

