గిరిజన అభ్యర్థులకు సివిల్స్‌లో ఉచిత శిక్షణ ఇవ్వాలనుకున్న ఐటీడీఏ అధికారుల ఆలోచనలకు ఆదిలోనే అడ్డంకులు ఏర్పడ్డాయి. ఉచిత శిక్షణకు సంబంధించి ఐటీడీఏ అధికారులు టెండర్లు ఆహ్వానించారు.టెండర్ల ప్రక్రియలో పాల్గొనే ఏజెన్సీలకు ఎస్టీ అభ్యర్థులకు కనీసం రెండేళ్లు కోచింగ్ ఇచ్చిన అనుభవం ఉండాలనే నిబంధన పెట్టారు. టెండర్ల ప్రక్రియలో కేవలం 21వ సెంచరీ అకాడమీ మాత్రమే అర్హత సాధించింది. దీంతో టెండర్ల ప్రక్రియ ఏకపక్షంగా నిర్వహించారని శరత్చంద్ర కోచింగ్ అకాడమీ హైకోర్టును ఆశ్రయించింది.

