తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు ఉందని సిట్ రిపోర్ట్‌లో స్పష్టంగా ఉందని, ఈ విషయంలో వైసీపీకి సిట్ క్లీన్‌చిట్ ఇవ్వలేదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. గురువారం అమరావతి సచివాలయంలో సీఎం చంద్రబాబుతో కలిసి మీడియాతో మాట్లాడారు. విషయంలో తప్పుచేసిన వారు నాశనమైపోతారని అన్నారు. ఇప్పటికైనా చేసిన పాపానికి దేవుడిని క్షమాపణ కోరుకోవాలని వైసీపీ నాయకులకు సూచించారు. భగవంతుడి వద్ద మోకరిల్లే వరకూ విషయాన్ని వదిలిపెట్టబోమని, హిందూ ధర్మాన్ని కాపాడే విషయంలో చాలా స్పష్టంగా ఉన్నామని వెల్లడించారు.

