ఆదివాసులు, గిరిజనులపై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క శ్వేతపత్రం విడుదల చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. శుక్రవారం నాడు మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ పాలనలో ఆదివాసులు,
గిరిజనులకు ఏం చేశారో వెల్లడించాలన్నారు. సింగరేణి పుట్టినిల్లు ఇల్లందులో కొత్త బొగ్గు బావులు మొదలు పెట్టాలని అన్నారు. సింగరేణి కార్మికులు సంక్షేమం కోసం కాకుండా సీఎం రేవంత్ ఫుట్ బాల్ కోసం పది కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు. ముగ్గురు మంత్రులు ఉన్న జిల్లాలో కొత్తగూడెంకు ప్రాధాన్యం లేదని విమర్శించారు.

