కరీంనగర్ జిల్లా చింతకుంట గాంధీనగర్‌లో విషాదం నిండిన వేళ ఇంటి యజమాని అమానుషంగా వ్యవహరించారు. శ్రీకాంత్ అనే ఓ ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని ఇంట్లోకి రానివ్వకపోవడంతో కుటుంబ సభ్యులు శ్మశానంలో అంత్యక్రియలు పూర్తి చేశారు. అయితే శ్రీకాంత్ మరణానంతరం కూడా అతని భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి శ్రీకాంత్ తల్లిని ఇంటి యజమాని ఇంట్లోకి రావడానికి అనుమతివ్వకపోవడంతో స్మశానంలోనే గత 7రోజులుగా కాలం వెళ్లదీస్తున్నారు. ఇరుగు,పొరుగు వాళ్లను దూరం పెట్టడం అత్యంత హేయమైన సంఘటనగా నిలిచింది.

