తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మండలం పెరవలిలో డిప్యూటీ సీఎం శనివారం పర్యటించారు. అమరజీవి జలధార పథకానికి శంకుస్థాపన చేశారు. అధికారంలోకి వచ్చిన తరువాత రెండు నెలల్లో జైలుకే పంపిస్తామని వైఎస్ జగన్ రెండు రోజుల క్రితం హెచ్చరించారు. ఈ హెచ్చరికల నేపధ్యంలో పవన్ కల్యాణ్ జగన్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. దౌర్జన్యాలకు దిగుతూ మళ్లీ వస్తామంటూ దిగజారి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే ఏమీ చేయలేకపోయారు. ఇప్పుడేం చేస్తారని విమర్శించారు. ఎవరి బెదిరింపులకు కూటమి ప్రభుత్వం భయపడలేదని స్పష్టం చేశారు.

