loader

తనను ఉద్యోగం నుండి డిస్మిస్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంకట్రామిరెడ్డి తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా, కక్షపూరితంగా ఈ చర్య తీసుకుందని ఆయన ఆరోపించారు. 2014-19 మధ్య కాలంలో కూడా పలువురు ప్రభుత్వ ఉద్యోగులు అప్పటి ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేశారని, కానీ వారిపై ఇలాంటి డిస్మిస్ చర్యలు ఎప్పుడూ తీసుకోలేదని వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. కేవలం ఉద్యోగులు ఎవరూ నోరు మెదపకూడదనే భయం సృష్టించేందుకే ప్రభుత్వం ఈ వేటు వేసిందని విమర్శించారు. ప్రభుత్వం జారీ చేసిన జీవోను చట్టపరంగా సవాలు చేస్తానని వెల్లడించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON