ఐఫోన్లు సహా వివిధ ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు తయారు చేసే ప్రముఖ తైవాన్ సంస్థ ఫాక్స్కాన్ హైదరాబాద్ ప్లాంట్ను రూ. 4,800 కోట్లతో విస్తరించాలని నిర్ణయించింది. వచ్చే ఆరు నుంచి ఎనిమిది మాసాల్లో కొంగరకలాన్ ప్లాంట్లో తమ ఉత్పత్తిని రెట్టింపు చేయాలనుకుంటున్నట్టు ప్రకటించింది.ప్రస్తుతం ఇక్కడ నెలకు లక్ష ఎయిర్పాడ్లు ఉత్పత్తి అవుతుండగా, విస్తరణ పూర్తయ్యాక ఇది రెండు లక్షలకు చేరుకుంటుందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి.

