గీతం యూనివర్సిటీకి భూ కేటాయింపునకు వ్యతిరేకంగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వైఎస్సార్సీపీ నిరసన దీక్ష చేపట్టింది. నిరసన దీక్ష అనంతరం గాంధీ విగ్రహం నుంచి వైఎస్సార్సీపీ నేతలు ర్యాలీగా కౌన్సిల్ సమావేశానికి వెళ్లారు. గీతం యూనివర్సిటీకి 5 వేల కోట్ల విలువచేసే భూములను క్రమబద్ధీకరించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఇవాళ జరిగే జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో క్రమబద్ధీకరణకు నిర్ణయం తీసుకోనుంది. గీతంకు భూ కేటాయింపుపై పెద్ద ఎత్తున వైఎస్సార్సీపీ పోరాటానికి దిగింది.

