తమిళగ వెట్రి కజగం (TVK) ప్రచార కార్యాలయంపై గురువారం రాత్రి గుర్తుతెలియని దుండగులు దాడి చేసి నిప్పుపెట్టారు. మే 4న ఫలితాలు వెలువడనున్న తరుణంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పెట్టవైత్తళై ప్రాంతంలో ఉన్న టీవీకే అభ్యర్థి రమేష్‌కు చెందిన ఈ కార్యాలయంలోకి మే 1వ తేదీ సాయంత్రం 4:43 గంటల సమయంలో ఇద్దరు వ్యక్తులు చొరబడినట్లు సీసీటీవీ ఫుటేజీలో స్పష్టంగా కనిపిస్తోంది.
కార్యాలయానికి నిప్పుపెట్టిన వెంటనే ఆ దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు.

