అండర్ -19 వరల్డ్‌కప్ హీరోలపై ప్రశంసల జట్లు కురుస్తోంది. జగజ్జేతలుగా స్వదేశం తిరిగొచ్చిన భారత బృందాన్ని దిగ్గజ ఆటగాళ్లు ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ తాజాగా కెప్టెన్ ఆయుశ్ మాత్రేకు అపురూపమైన కానుక అందించాడు. భారత్‌ను అజేయంగా నడిపించి విశ్వ విజేతగా నిలిపింనందుకు అతడికి తన టెస్టు జెర్సీని బహూకరించాడు. లెజెండరీ ఆటగాడి నుంచి విలువైన బహుమతి అందుకున్న మాత్రే సంతోషం వ్యక్తం చేస్తూ పోస్ట్ పెట్టాడు.

