లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కీలక నిర్ణయం తీసుకున్నారు. అవిశ్వాస తీర్మానం (No confidence Motion)పై చర్చ పూర్తయ్యేంత వరకూ సభకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. స్పీకర్ను తొలగించాలంటూ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు లోక్సభ సెక్రటరీకి కాంగ్రెస్ నోటీసు ఇచ్చిన నేపథ్యంలో ఓం బిర్లా ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో రాహుల్ గాంధీకి స్పీకర్ అవకాశం ఇవ్వలేదని, నిలదీసిన 8 మంది ఎంపీలపై సస్పెన్స్ వేటువేశారని విపక్షాలు తప్పుపడుతున్నాయి.

