తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర విమర్శలతో వేడి పెరిగింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ, ప్రస్తుతం తెలంగాణలో ప్రజాపాలన కాకుండా “పక్కా మాఫియా పాలన” కొనసాగుతోందని ఆరోపించారు. ఇసుక మాఫియా ప్రయోజనాల కోసం కోట్లాది రూపాయల ప్రజాధనంతో నిర్మించిన చెక్‌డ్యామ్‌లను జెలటిన్ స్టిక్స్‌తో పేల్చేస్తున్నారని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు కేటీఆర్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ప్రభుత్వాన్ని నిలదీశారు.

