జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన రాష్ట్రానికి చెందిన వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాను ప్రకటించారు. బుధవారం రాత్రి విశాఖపట్నం విమానాశ్రయంలో చంద్రమౌళి భౌతికకాయానికి నివాళి అర్పించారు. మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ కష్ట సమయంలో మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మృతుల కుటుంబాలకు 10 లక్షల ఎక్స్గ్రేషియాను ప్రకటించారు. పహల్గామ్ ఉగ్రదాడిని ఆయన తీవ్రంగా ఖండించారు.

