ఓట్ చోరీ పేరుతో రాహుల్ గాంధీ చేపట్టిన ర్యాలీకి వైసీపీ ఎందుకు దూరంగా ఉందని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా… దేశంలో ఓట్ల చోరీ అంటూ మాట్లాడుతున్న రాహుల్ గాంధీ… ఆంధ్రప్రదేశ్ గురించి ఎందుకు మాట్లాడటం లేదని వైఎస్ జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు, రాహుల్ గాంధీలు హాట్ లైన్‌లో టచ్‌లో ఉన్నారని ఆరోపించారు. ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్‌గా ఉన్న మాణిక్కం ఠాకూర్ ఏ రోజైన చంద్రబాబు గురించి మాట్లాడారా? అని ప్రశ్నించారు. ఏపీలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుంటే ఆయన ఎందుకు మాట్లాడరని అడిగారు.

