మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోలో రాబోతున్న చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’. ఈరోజు వెంకటేష్, చిరంజీవి కలిసి డాన్స్ కుమ్మేసిన మెగా విక్టరీ మాస్ సాంగ్ ని రిలీజ్ చేశారు. మార్నింగ్ గ్రీన్ టీ… కుమ్మేద్దాం చంటి… అంటూ మంచి మాస్ స్పీడ్ తో సాగే ఈ పాటలో మెగాస్టార్ తో పాటు వెంకీ కూడా స్టెప్పులు వేసి అదరగొట్టెయ్యటం ఏంటీ బాసూ సంగతి.. అదిరిపోద్ది సంక్రాంతి అంటూ చిరంజీవి తో కలిసి వెంకటేష్ ఊపు తెప్పించారు.

