రాష్ట్రవ్యాప్తంగా ముస్లిం సోదరులు రంజాన్ పండుగను ఘనంగా జరుపుకున్నారు. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని సాముహిక ప్రార్థనలు చేశారు. భారీగా తరలివచ్చిన ముస్లిం సోదరులతో మసీదులన్నీ కళకళలాడాయి. నగర శివారు గొల్లగూడెం ఈద్గా మైదానంలో వేలాది మంది ముస్లిం సోదరులు ప్రార్థనలో పాల్గొన్నారు.మీరాలం ఈద్గాలో ప్రార్థనలకు ముస్లింలు భారీగా తరలివచ్చారు.రాష్ట్రంలోని మసీదులలో వేలమంది ముస్లీంలు సామూహిక ప్రార్థనలు చేశారు

