బడ్జెట్లో చూపించిన లెక్కలు, రాష్ట్ర ఆర్థిక వాస్తవాల మధ్య పెద్ద తేడా ఉందని ఆరోపించారు. ఈ బడ్జెట్ ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా రూపొందించారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు సరైన విధంగా ఉపయోగించడం లేదని, అవి ప్రజల అభివృద్ధికి దోహదం కావడం లేదని కూడా ఆరోపించారు. మరోవైపు ప్రభుత్వ నాయకుల ఖర్చులు పెరుగుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,నారా లోకేష్,పవన్ కళ్యాణ్ విమానాలు,హెలికాప్టర్లల్లో తరచూ ప్రయాణాలు చేస్తూ ప్రభుత్వ ఖర్చులు పెంచుతున్నారని విమర్శించారు.

