నీళ్లు కావాలా? గొడవలు కావాలా? అంటే తాము నీళ్లే కావాలని కోరుకుంటామని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. జలాల వినియోగంపై తెలంగాణ నేతల ఆరోపణలు అర్థరహితమని కొట్టిపారేశారు. తెలంగాణ నేతల వాదనలను మన రాష్ట్రంలో చొప్పించి, వైఎస్సార్సీపీ రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం అవివేకమని మండిపడ్డారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని జగన్ ప్రభుత్వమే అడ్డుకుందని పేర్కొన్నారు.అనుమతులు తీసుకోకుండా రాయలసీమ ఎత్తిపోతల పథకానికి 2020 మే 5న జగన్ ఆమోదం తెలిపారని అన్నారు.

