loader

రాజస్థాన్‌ రాష్ట్రం బలోత్రా జిల్లా పచ్‌పద్రలోని రిఫైనరీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పెట్రోల్‌ రిఫైనరీలో మంటలు ఎగసిపడుతున్నాయి. పరిసరాల్లో దట్టంగా పొగ అలముకుంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. మంగళవారం ప్రధాని మోదీ చేతుల మీదుగా ఈ రిఫైనరీ ప్రారంభం కావాల్సి ఉంది. దేశంలోనే మొదటి గ్రీన్‌ఫీల్డ్‌ రిఫైనరీ, పెట్రోకెమికల్‌ కాంప్లెక్స్‌గా రూ.79,450 కోట్లకుపైగా వ్యయంతో దీన్ని నిర్మించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON