రాజమండ్రి సెంట్రల్ జైల్లో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డితో వైసీపీ కీలక నేత పేర్ని నాని ఇవాళ (మంగళవారం) ములాఖత్ అయ్యారు. అనంతరం మీడియాతో పేర్నినాని మాట్లాడారు. ఎంపీ మిథున్ రెడ్డిని అక్రమ కేసులో ఇరికించి అరెస్టు చేశారని..
ఇవాళ ఆయనను పరామర్శించానని చెప్పుకొచ్చారు. మిథున్ రెడ్డిని కూటమి ప్రభుత్వం అరెస్టు చేసి 40 రోజులు అయ్యిందని, ఒక్క రోజు కూడా కస్టడీకి ఎందుకు తీసుకోలేదని, మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబాన్ని మానసింగా కుంగదీసేందుకే అరెస్ట్ చేశారని పేర్ని నాని ఆవేదన వ్యక్తం చేశారు.

