
<span;>ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చొరబాటుదారు అని సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ సంచలన కామెంట్లు చేశారు. యోగి జన్మస్థలం ఉత్తరాఖండ్ కాబట్టి.. ఆయన్ను వెంటనే అక్కడికి పంపించేయాలంటూ డిమాండ్ చేశారు. అంతటితో ఆగకుండా భౌగోళికంగానే కాక భావజాల పరంగా కూడా సీఎం యోగి చొరబాటుదారుడే అని తీవ్ర ఆరోపణలు గుప్పించారు. రామ్ మనోహర్ లోహియా వర్ధంతి సందర్భంగా ఈ కామెంట్లు చేసిన అఖిలేష్ యాదవ్.. బీజేపీ ప్రభుత్వంపై కూడా విమర్శలు చేశారు.