రాష్ట్రంలో తొలి విడుత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. పెద్ద సంఖ్యలో ఓటర్లు క్యూన్లలో బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. గురువారం ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలు కాగా.. మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగనున్నది.ఆ తర్వాత 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిర్వహించి.. ఫలితాలను ప్రకటిస్తారు.

