జహీరాబాద్ లోని (TMREIS) తెలంగాణ మైనారిటీ గురుకుల పాఠశాలలో చదివి ఎంబీబీఎస్‌లో సీటు పొందిన విద్యార్థులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు సన్మానించారు. ఎంబీబీఎస్ సీట్ సాధించిన మైనార్టీ విద్యార్థులకు, వారి తల్లిదండ్రులను కేటీఆర్ , హరీశ్ రావు శాలువతో సత్కరించి సన్మానించారు. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో 203 మైనార్టీ గురుకులాలు ఏర్పాటు చేసింది కేసీఆర్ అని స్పష్టం చేశారు.

