కోఠి మహిళా విశ్వవిద్యాలయంలో వేధింపుల ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. విశ్వవిద్యాలయంలో పీజీ చదువుతున్న పలువురు విద్యార్థినులు, తాము నివసిస్తున్న ఉస్మానియా యూనివర్సిటీ గర్ల్స్ హాస్టల్లో మెస్ ఇంచార్జీగా పనిచేస్తున్న వినోద్ తమను మానసికంగా వేధిస్తున్నాడంటూ షీటీమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన విద్యార్థినుల భద్రతపై తీవ్ర ఆందోళనలను కలిగిస్తోంది. మెస్ ఇంచార్జీ వినోద్ ప్రవర్తన వల్ల హాస్టల్లో ఉండాలంటే భయంగా ఉందని బాధితులు ఆరోపిస్తున్నారు. ఆయన వ్యవహారం కారణంగా చదువుపై దృష్టి సారించలేని పరిస్థితి ఏర్పడిందని విద్యార్థినులు వాపోయారు.

