చిట్యాల మున్సిపాలిటీలో ఓ ట్రాన్స్జెండర్ ఒకటో వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించడం అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. తన వార్డును అన్ని రంగాల్లో అభివృద్ది చేస్తానని హామీ ఇచ్చిన సుధాకర్ ఓటర్లను ఆకట్టుకుని ప్రత్యర్థులను ఓడించారు. ఈ వార్డు ఎస్సీ జనరల్ వర్గానికి రిజర్వ్ కాగా.. సుధాకర్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ప్రత్యర్థులుగా కాంగ్రెస్, సీపీఎం పొత్తులో భాగంగా సీపీఎం అభ్యర్థిని, బీజేపీ, బీఆర్ఎస్, బీఎస్పీ అభ్యర్థులు పోటీ చేసినా 100 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.

