కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి జీవన్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో బాధపడుతుండగా కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్కు తరలించారు. కాగా, జీవన్ రెడ్డి ఇటీవల కాలంగా కాంగ్రెస్ పార్టీలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. సీనియర్ అయిన తనను సరిగా గౌరవం ఇవ్వడం లేదని అసృంతృప్తికి లోనవుతున్నాడు. జీవన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

