మహిళా బిల్లు వీగిపోవడం బిజెపి విధానాల ఓటమిగా భావిస్తోందని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మహిళా బిల్లు పేరుతో డీలిమేషన్ బిల్లు తీసుకు వచ్చిందని అన్నారు. మహిళా రిజర్వేషన్ల బిల్లుపై తమకు చిత్తశుద్ధి ఉందని తెలియజేశారు. మహిళా బిల్లుపై ప్రధాని నరేంద్రమోడీకి నిజాయితీ లేదని విమర్శించారు. నిజాయితీగా మహిళా రిజర్వేషన్ల బిల్లు తీసుకువస్తే మద్దతు ఇచ్చేవారని అన్నారు. మహిళా బిల్లు పేరుతో డీలిమిటేషన్ బిల్లు తీసుకువచ్చి దక్షిణాదికి అన్యాయం చేసేవారని మండిపడ్డారు. కేంద్రానికి ఆర్థిక వనరులు దక్షిణాది నుంచి అందుతున్నాయని యూపీ ఎన్నికలలో మహిళా రిజర్వేషన్ల బిల్లు అమలు చేయాలని సూచించారు.

