రాజ్యాంగసవరణ బిల్లు వీగిపోయిన సందర్భంగా ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ దేశంలోని ప్రతి పౌరుడు మహిళల పురోగతి ఎలా నిలిచిపోయిందో చూస్తున్నారు… మా శతవిధ ప్రయత్నాల పట్టికీ, మేము విజయం సాధించలేకపోయామని ఆయన తెలిపారు. నారీ శక్తి అధినియంలో సవరణలు చేయలేకపోయాము. దీనికి గాను దేశంలోని తల్లులందరికీ, సోదరీమణులందరికీ నేను క్షమాపణలు కోరుతున్నానని మోదీతెలిపారు.మహిళా శక్తిని తక్కువ అంచనా వేస్తున్నారని హెచ్చరించారు.

