మహారాష్ట్ర ఓటర్ల జాబితాలో 96లక్షల బోగస్ ఓట్లు నమోదైనట్లు ఆరోపించారు మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే. వీటిని తొలగించకుండానే స్థానిక సంస్థల ఎన్నికలు ఎలా నిర్వహిస్తారంటూ ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించారు. బోగస్ ఓట్లతో ఎన్నికలు నిర్వహించడం నిజమైన ఓటర్లను అవమానించడమే అవుతుందన్నారు. ఎంఎన్ఎస్ పార్టీ బూత్ స్థాయి ఏజెంట్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఓటర్ జాబితాను పరిశీలించి ఫేక్ ఓటర్లను కనిపెట్టాలని పార్టీ కార్యకర్తలను కోరారు.

