మృతి చెందిన ఉద్యోగికి ఎలక్షన్ డ్యూటీ వేసిన సంఘటన నిర్మల్ జిల్లా, కడెం మండలం, పెద్దూర్ తండాలో చోటుచేసుకుంది. ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు వీలుగా పెద్దూరు తండాకు చెందిన హార్టికల్చర్ ఉద్యోగికి అధికారులు డ్యూటీ వేశారు. దీంతో పలువురు ఒక్కసారి షాక్‌కు గురయ్యారు. గ్రామానికి చెందిన సదరు ఉద్యోగి మరణించాడని, కానీ అతనికి ఎలక్షన్ డ్యూటీ వేయడమేంటని పలువురు ఆశ్చర్యానికి లోనయ్యారు.

