మణిపూర్ కొత్త ముఖ్యమంత్రిగా బీజేపీకి చెందిన యుమ్నాం ఖేమ్ చంద్ సింగ్ బుధవారం నాడు ప్రమాణస్వీకారం చేశారు.గవర్నర్ అజయ్ కుమార్ భల్లా ఆయన చేత సీఎంగా ప్రమాణం చేయించారు. కుకి వర్గానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే నమ్చా కిఫ్గెన్, నాగా పీపుల్స్ ఫ్రంట్ శాసన సభ్యుడు ఎల్ దిఖో మణిపూర్ డిప్యూటీ ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీకి చెందిన గోవిందాస్ కోంథోజామ్ , ఎన్ పిపికి చెందిన కె. లోకెన్ సింగ్ కూడా మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.

