మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్, ఆయన అర్ధాంగి బ్రహ్మణి పాల్గొన్నారు. సోమవారం అర్ధరాత్రి 12 గంటలకు నిర్వహించిన శ్రీవారి కల్యాణ మహోత్సవంలో పాల్గొని, రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం వేద మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ జరిగిన స్వామివారి కల్యాణాన్ని వారు భక్తిశ్రద్ధలతో తిలకించారు.

