అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. తన సన్నిహిత సహాయకుడు, విధేయుడు అయిన సెర్గియో గోర్‌ను భారత్‌కు తదుపరి అమెరికా రాయబారిగా నియమిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
సెర్గియో గోర్ ఒక దశాబ్దానికి పైగా డొనాల్డ్ ట్రంప్‌కు విధేయుడిగా పని చేస్తున్నారు. ట్రంప్ 2016 అధ్యక్ష ఎన్నికల ప్రచారంలోనూ, ఆ తర్వాత ఆయన పరిపాలనలోనూ గోర్ కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం కూడా ఆయన వైట్‌హౌస్‌లో ప్రెసిడెన్షియల్ పర్సనల్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

