ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధస్సు (AI) విప్లవానికి మార్గదర్శకంగా నిలిచిన చాట్‌జీపీటీ మాతృసంస్థ OpenAI ఇప్పుడు భారత మార్కెట్‌పై దృష్టి సారించింది. ఈ ఏడాది ఆగస్టులో ఓపెన్‌ఏఐ అధికారికంగా భారత్‌లో బ్రాంచ్ ఏర్పాటు చేసిందని,
ప్రస్తుతం సొల్యూషన్ ఇంజనీర్‌ల నియామకాలు జరుగుతున్నాయని వెల్లడించారు. బెంగళూరును కేంద్రంగా చేసుకుని, భారత డెవలపర్ కమ్యూనిటీలతో సంబంధాలను బలోపేతం చేయడం, టెక్నాలజీ భాగస్వామ్యాలను పెంచడం సంస్థ తదుపరి లక్ష్యమని చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ నారాయణన్ వివరించారు.

