పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా నుంచి భారత్ కు అణుబాంబు బెదిరింపులు చేశారు. భారత్ నుంచి పాకిస్థాన్ ఉనికికి ముప్పు ఉందని భావిస్తే.. అణుబాంబు సగం ప్రపంచాన్ని ముంచివేస్తుందని హెచ్చరించారు. పాక్ సైన్యాధిపతిగా అసిఫ్ మునీర్ అమెరికా గడ్డ నుంచి భారత్కు అణు బెదిరింపు చేయడం ఇదే మొదటిసారి. తమ దేశం ఉనికి పోతున్నట్లు భావిస్తే సగం ప్రపంచాన్ని మాతో తీసుకెళ్తామని పేర్కొన్నారు

