
అమెరికాకు చెందిన రాజకీయ నేత చాండ్లర్ లాంగేవిన్ భారతీయులకు వ్యతిరేకంగా విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడం కలకలం రేపుతోంది. అమెరికాలోని ప్రతి భారతీయుడిని వెంటనే బహిష్కరించాలంటూ ఆయన సోషల్ మీడియా లో పోస్టులు పెట్టాడు. ఆ పోస్టులపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దాంతో పామ్ బే నగర కౌన్సిల్ ఆయనపై చర్యలు తీసుకుంది. చాండ్లర్ లాంగేవిన్ ఫ్లోరిడాలోని పామ్ బే సిటీ కౌన్సిల్‌కు చెందిన యూఎస్ కన్జర్వేటివ్ పార్టీ నాయకుడు.