ఖలిస్తానీ ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. భారత్-కెనడా మధ్య దౌత్య సంబంధాలు తిరిగి ప్రారంభమైన వేళ తీవ్ర బెదిరింపులకు పాల్పడ్డారు. వాంకోవర్‌లోని భారత కాన్సులేట్‌ను స్వాధీనం చేసుకుంటామంటూ హెచ్చరించారు.
అమెరికాకు చెందిన ఖలిస్తానీ సంస్థ సిక్స్ ఫర్ జస్టిస్ ఈ బెదిరింపులకు పాల్పడింది. ఈ నెల 18న (గురువారం) వాంకోవర్‌లోని భారత కాన్సులేట్‌ను ముట్టడించి స్వాధీనం చేసుకుంటామని తెలిపింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ ఉండొద్దంటూ ఓ ప్రకటనలో హెచ్చరించింది

