
శారదా పీఠం మఠం భవన నిర్మాణంలో ఆక్రమణలు, అవకతవకలు జరిగినట్లు టీటీడీ అధికారుల కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా తిరుమలలో శారదా పీఠం ఆక్రమణలను తొలగిస్తామని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు బోర్డు సమావేశంలో పేర్కొన్నారు. నిబంధనలను మఠం ఉల్లంఘించిందని న్యాయస్థానం గుర్తించడంతోపాటు మఠంపై చర్యలు తీసుకునే అధికారం టీటీడీకు ఉందని తీర్పులో పేర్కొంది. ఈ మేరకు 15 రోజుల్లోపు మఠాన్ని ఖాళీ చేసి భవనాన్ని అప్పగించాలని టీటీడీ ఎస్టేట్ విభాగం నోటీసు జారీ చేసింది.