కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుమారుడు, ఐసీసీ ఛైర్మన్ కూడా అయిన జై షాపై విమర్శలు గుప్పించారు. “మీరు అదానీ, అంబానీ లేదా అమిత్ షా కొడుకు అయితేనే మీరు పెద్దగా కలలు కనగలరు. అమిత్ షా కొడుకు (జై షా)కి బ్యాట్ ఎలా పట్టుకోవాలో కూడా తెలియదు, పరుగు తీయడం మర్చిపోండి. కానీ ఆయన క్రికెట్ చీఫ్. క్రికెట్లో ప్రతి దానినీ ఆయన నియంత్రిస్తాడు. ఆయన ప్రతిదీ ఎందుకు నియంత్రిస్తాడు? డబ్బు కారణంగా” అని అన్నారు.

