
బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ ఫ్యామిలీకి బిగ్ షాక్ తగిలింది. ఐఆర్‌సీటీసీ కుంభకోణానికి సంబంధించిన అవినీతి కేసులో లాలూతో పాటు ఆయన భార్య రబ్రీదేవీ, కుమారుడు తేజస్వీ యాదవ్‌పై సోమవారం ఢిల్లీ కోర్టు అభియోగాలు మోపింది. లాలూ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో ఐఆర్‌సీటీసీ హోటళ్ల నిర్వహణ కాంట్రాక్టులలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి ఈ మేరకు 2017లో లాలూ కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసిన సీబీఐ.. తాజాగా ఛార్జిషీట్ దాఖలు చేసింది.