పాలమూరు జిల్లాలో బీజేపీ జాతీయ అధ్యక్షుడిని ప్రచారానికి తీసుకువచ్చారని గుర్తు చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారానికి ప్రధాని సహా దేశం మొత్తం నేతలను తీసుకురండని హితువు పిలికారు. బీజేపీ అందరినీ ప్రచారానికి తెచ్చినా ఒక్క మున్సిపాలిటీ అయినా గెలుస్తారా? అడిగారు. కాంగ్రెస్ పార్టీ సత్తా ఏంటో బీజేపీకి చూపిస్తామని సవాల్ విసిరారు.కరీంనగర్ జిల్లా గుమ్లాపూర్‌లో పర్యటించిన సీఎం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. తెలంగాణ ఏర్పాటు చేస్తామని సోనియాగాంధీ ఈ గడ్డపై నుంచి మాట ఇచ్చారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

