మంచిర్యాల జిల్లాలోని బీఆర్ఎస్ ఏజెంట్లను పోలింగ్ బూత్‌ల లోపలికి వెళ్లకుండా పోలీసులతో కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకుంటోంది. లక్సేట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని 9వ, 10వ పోలింగ్ కేంద్రాల దగ్గర బీఆర్ఎస్ ఏజెంట్‌గా ఉన్న మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్‌ను పోలింగ్ బూత్ లోపలికి వెళ్లకుం పోలీసులు అడ్డుకున్నారు. ఆయన ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించడంతో పోలింగ్ కేంద్రం ఆవరణ నుంచి పక్కకు ఈడ్చుకెళ్లారు. పోలీసుల తీరును నిరసిస్తూ ఆయన పోలింగ్ కేంద్రం ఎదురుగా రోడ్డుపై బైఠాయించారు

