హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ అయ్యారు.. ఆయన్ను వరంగల్ పోలీసులు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వద్ద అదుపులోకి తీసుకున్నారు.. అక్కడి నుండి నేరుగా హన్మకొండలోని సుబేదారి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే రెండు నెలల క్రితం హుజురాబాద్ నియోజకవర్గం పరిధిలో గ్రానైట్ క్వారీ నిర్వహిస్తున్న ఓ వ్యాపారిని బెదిరించి రూ.50 లక్షలు డిమాండ్ చేశాడని బాధితుడి ఫిర్యాదుతో కౌషిక్ రెడ్డిపై కేసు నమోదు చేసిన సుబేదార్ పోలసులు.. ఆయన్ను అరెస్ట్ చేసి పీఎస్కు తరలించారు

