భారతీయ బియ్యం దిగుమతులపై అధిక టారిఫ్‌ను వసూల్ చేసేందుకు అమెరికా సర్కారు సిద్దమైంది. వ్యవసాయ దిగుమతులపై కొత్త పన్ను విధానాన్ని అమలు చేయనున్నట్లు ట్రంప్ వెల్లడించారు. భారత్ నుంచి దిగుమతి అవుతున్న బియ్యంతో పాటు కెనడా నుంచి దిగుమతి అవుతున్న ఫెర్టిలైజర్లపై కొత్త సుంకాలు విధించనున్నట్లు ఆయన చెప్పారు. అమెరికా రైతుల కోసం ట్రంప్ సర్కారు భారీ రిలీఫ్ ప్యాకేజీని ప్రకటించింది. ఈ నేపథ్యంలో శ్వేతసౌధంలో జరిగిన సమావేశంలో రైతు పెద్దలతో ట్రంప్ మాట్లాడారు.

